హారిక పరాజయం
విక్ ఆన్‌జీ: టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారికకు మరో ఓటమి ఎదురైంది. ఛాలెంజర్స్ విభాగం అయిదో రౌండ్లో లియాన్ ల్యూక్‌కు హారిక తలొంచింది. ఈ ఓటమితో 1.5 పాయింట్లతో ఈ తెలుగమ్మాయి పన్నెండో స్థానంలో కొనసాగుతోంది. అయిదు రౌండ్లలో మూడు గేమ్‌లను డ్రా చేసుకున్న హారిక.. రెండింట్లో ఓడింది. ఇమాజ్ ముస్తఫా చేతిలో ఓడిన దివ్య దేశ్‌ముఖ్ (1.5) 13వ స్థానంలో ఉంది. మాస్టర్స్ విభాగం అయిదో రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)పై గుకేశ్ విజయం సాధించాడు. ప్రజ్ఞానంద (3) మూడు, గుకేశ్ (2.5) ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.