పారా అథ్లెట్లకు ఆర్థిక సాయం
హైదరాబాద్ : పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులు, వారి కోచ్‌లకు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ కుమార్తె రమ్య రూ. 20 లక్షలు ఆర్థిక సాయం అందించారు.వరంగల్ అథ్లెట్ దీప్తితో పాటు తులసీమతి మురుగేశన్, నితీశ్‌కుమార్‌కు తలో రూ.5 లక్షలు, కోచ్ నాగపురి రమేశ్ సిబ్బందికి రూ.5 లక్షలు నగదు ప్రోత్సాహకంగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.