స్పోర్ట్స్ పాలసీపై భేటీ
హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రతిభావంతులైన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు స్పోర్స్ పాలసీ భేటీ జరిగింది. బుధవారం స్థానిక టూరిజం ప్లాజాలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థి కనీసం ఏదో ఒక క్రీడలో ఆడే విధంగా రాష్ట్ర క్రీడా పాలసీ ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారికి తగిన ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సాట్‌జీ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల సలహాదారు జితేందర్‌రెడ్డి, వేణుగోపాలచారి, క్రీడాశాఖ ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, సాట్‌జీ ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు.