వెయింగ్ రూల్స్‌లో మార్పులు?
న్యూఢిల్లీ: వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు క్రీడావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రెజ్లర్ల వెయింగ్ (బరువు తూచడం) విషయంలో మార్పులు చేయాలని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అథ్లెట్ల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేసే నిబంధనల సడలింపులు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తాయని భావిస్త్తున్నారు.
తన కేటగిరీలో కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో తనను ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కొందరు మాజీ రెజ్లర్లు వెయింగ్ నిబంధనలు మార్చాలని సూచిస్తున్నారు. వరల్డ్‌క్‌పతోపాటు కొన్ని ప్రముఖ టోర్నీల్లో రెండు కిలోల బరువు వరకు అనుమతిస్తున్నారు.
కానీ విశ్వక్రీడల్లో వెసులుబాటు ఇవ్వడం లేదు. అయితే, రెండోరోజు పోటీల్లో పాల్గొనే రెజ్లర్లకు ఒక కిలో అదనంగా బరువు ఉన్నా అనుమతించాలని అమెరికా రెజ్లింగ్ గ్రేట్ జోర్డాన్ బర్రోగ్స్ సూచించాడు.