జావెలిన్‌లోవరల్డ్ రికార్డు
ఒలింపియన్ అర్షద్ నదీమ్ లైఫ్ స్టోరీ ఇదీ..!
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు పాకిస్థాన్ నుంచి వెళ్లిన అథ్లెట్లకు ఆ దేశ క్రీడా సంఘం కొందరికి మాత్రమే ఫైనాన్స్ చేసింది. దాంట్లో జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఒక్కడు. అతని కోచ్‌కు కూడా పాక్ స్పోర్ట్స్ బాడీ స్పాన్సర్ చేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలోని ఖానేవాల్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల నదీమ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. జావెలిన్‌లో సరికొత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో జావెలిన్‌ను అత్యంత దూరం విసిరిన ఒలింపిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఫెవరేట్ నీరజ్ చోప్రాకు షాకిచ్చాడు.
నదీమ్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతని ఇంట్లో కనీసం సరైన తిండి కూడా తినేవాళ్లు కాదు. ఏడు మంది సోదరుల్లో అతను మూడోవాడు. తండ్రి నిర్మాణ రంగంలో కార్మికుడిగా చేస్తుండేవాడు. తండ్రి ఒక్కడే సంపాదన చేస్తున్న కారణంగా.. చిన్నతనంలో వాళ్లు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మాంసం తినేవాళ్లు. ఈద్ అల్ అదా రోజున మాత్రమే వాళ్ల ఇంట్లో మాంసాన్ని వండేవారట.
ఒలింపిక్స్‌లో నదీమ్ తన త్రోతో కొత్త చరిత్రను సృష్టించాడు. జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసి అందర్నీ స్టన్ చేశాడు. గతంలో ఉన్న 90.57 మీటర్ల దూరం ఒలింపిక్ రికార్డును నదీమ్ చెరిపేశాడు. నదీమ్‌కు ప్రత్యర్థి అయిన నీరజ్ చోప్రా కూడా ఆ త్రోకు స్టన్ కావాల్సి వచ్చింది. నదీమ్ ఓ దశలో జావెలిన్ కొనేందుకు కూడా పైసలు లేవు. అర్షద్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడన్న విషయం ఎవరికీ అర్థం కాదు అని, అతను శిక్షణ కోసం వెళ్లే సమయంలో గ్రామస్థులు, బంధువులు సాయం చేసేవాళ్లు అని అతని తండ్రి అష్రఫ్ తెలిపాడు.
పాకిస్థాన్ నుంచి పారిస్‌కు వెళ్లిన ఏడు మంది అథ్లెట్లలో.. ఆరు మంది ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఒక్క నదీమ్ మాత్రమే ఫైనల్‌కు చేరి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఫైనల్స్‌కు నదీమ్ క్వాలిఫై అయిన మరుక్షణమే అతని ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పేరెంట్స్ స్వీట్లు పంచుకున్నారు.
నదీమ్ చాన్నాళ్లుగా ఉత్తమ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం రాగా, ఆ ఎడిషన్‌లో నదీమ్ అయిదో స్థానంలో నిలిచాడు.
తన వద్ద ఉన్న జావెలిన్‌ను మార్చాలని శిక్షణ సమయంలో పాకిస్థాన్ అధికారుల్ని నదీమ్ కోరాడు. ఆ సమయంలో నదీమ్‌కు సోషల్ మీడియా ద్వారా నీరజ్ చోప్రా అండగా నిలిచాడు