సెమీస్‌లో ఓటమి.. కాంస్యం వేటలో ధీరజ్, అంకిత
Paris Olymipics 2024
మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ సెమీ ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ జోడీ విఫలమైంది. వరల్డ్ నంబర్ 1 దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంటపై గెలుపొందిన ధీరజ్, అంకిత ద్వయం ఫైనల్ బెర్తు మాత్రం సాధించలేకపోయింది. కొరియా జంట 2-6తో నిరాశపరిచింది.
అయితే.. భారత జోడీకి ఒలింపిక్ మెడల్ గెలిచేందుకు మరో చాన్స్ ఉంది. కాంస్య పతక పోరులో అమెరికా ఆర్చర్ల టీమ్ బ్రాడీ ఎల్లిసన్, కాసే కౌఫ్‌హోల్డ్‌తో ధీరజ్, అంకిత తలపడనున్నారు. యూఎస్ఏ ఆర్చర్చ విషయానికొస్తే.. ఎల్లిసన్ ఇప్పటికే మూడు సార్లు ఒలింపిక్ మెడల్ సాధించాడు.
ఇక మహిశల సింగిల్స్‌లో కౌఫ్‌హోల్డ్ వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్. దాంతో, ధీరజ్, అంకితలకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో దక్షిణ కొరియా, జర్మనీ జోడీలు ఢీ కొట్టనున్నాయి.