తొలిసారి ఆసియా కప్ విజేతగా శ్రీలంక
- ఉతికేసిన ఆటపట్టు, సమరకవిక్రమ..
మహిళల ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జయభేరి మోగించింది. మెగా టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించింది. అజేయంగా టైటిల్ పోరుకు వచ్చిన భారత జట్టు(Team India)పై లంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల ఛేదనలో ఓపెనర్ చమరి ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్)లు ఉతికేశారు.
టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా లంక బ్యాటర్లకు వరమైంది. కవిష దిల్హరి(30 నాటౌట్)తో కలిసి 73 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన సమరవిక్రమ జట్టును విజయ తీరాలకు చేర్చింది. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన లంక ఆరో ప్రయత్నంలో ట్రోఫీని సగర్వంగా అందుకుంది.
మహిళల ఆసియా కప్ చరిత్రలో కొత్త చాంపియన్ అవతరించింది. ఏడుసార్లు చాంపియన్ టీమిండియాకు చెక్ పెడుతూ శ్రీలంక టైటిల్‌ను ఎగరసుకుపోయింది. దంబుల్లా స్టేడియంలో భారీ లక్ష్యాన్ని లంక మరో 8 బంతులు ఉండగానే ఊదేసింది. తొలుత భారత జట్టు 166 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(60) మరోసారి అర్ధ శతకంతో మెరిసింది.
మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్(29) ధనాధన్ ఆడగా ఆఖర్లో రీచా ఘోష్(30) బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. కవిష దిల్హరి వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టు స్కోర్ 150 దాటించింది. ఆఖరి ఓవర్లోనూ రీచా బౌండరీ కొట్టి ఔట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 రన్స్ కొట్టింది.
ఆటపట్టు విధ్వంసం..
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు ఉతికిపడేశారు. ఓపెనర్ విష్మీ గుణరత్నే(1) రనౌట్ అయ్యాక కెప్టెన్ చమరి ఆటపట్టు(61) విధ్వంసంక ఇన్నింగ్స్ ఆడింది. ఈ టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ఆమె హర్షిత సమరవిక్రమతో కలిసి భారత బౌలర్లను ఉతికేసింది. దాంతో, ఈ జోడీని విడదీసేందుకు హర్మన్‌ప్రీత్ తీవ్రంగా ప్రయత్నించింది.
అయితే.. అర్ధ శతకం తర్వాత దీప్తి శర్మ ఆమెను బౌల్డ్ చేసి బ్రేకిచ్చింది. కానీ, ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్), దిల్హరా(30 నాటౌట్) లు పట్టుదలగా ఆడారు. వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ డబుల్స్ తీస్తూ.. స్కోర్ బోర్డును ఉరికించారు. వీలుచిక్కినప్పుడు బౌండరీలతో జట్టును లక్ష్యానికి చేరువ చేశారు.
ఆ క్యాచ్ పట్టి ఉంటే
అయితే.. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సమరవిక్రమ ఇచ్చిన సులవైన క్యాచ్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేలపాలు చేసింది.
ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగేది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సమరవిక్రమ, దిల్హరలు బౌండరీలతో హోరెత్తించారు. పూజా వస్త్రాకర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని దిల్హర స్టాండ్స్‌లోకి పంపింది. అంతే.. ఆసియా కప్ చరిత్రలో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక కల నిజమైంది.
[8:01 pm, 28/07/2024] +91 831 765 7125: 😕 ఆర్చరీలో ‘హార్ట్ బ్రేక్’..!
– భజన్ కౌర్ పోరాటం వృథా
Paris Olympics 2024
ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చర్ల బృందం తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన టీమ్ క్వార్టర్ ఫైనల్లో దారుణంగా ఓడింది. తమ కంటే తక్కువ ర్యాంకర్ నెదర్లాండ్స్ జట్టు చేతిలో 0-6తో కంగుతిన్నది.
సీనియర్ ఆర్చర్ దీపికా కుమార్, భజన్ కౌర్, అంకిత భకత్ లతో కూడిన భారత బృందం క్వార్టర్స్‌లో తేలిపోయింది.
క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మెరిసిన అంకిత కీలక పోరులో సరిగ్గా గురి చూడలేకపోయింది.
భారత ఆర్చర్లలో భజన్ కౌర్ వరుసగా 10, 9 పాయింట్లు గెలిచి ఆశలు రేపింది. కానీ, దీపిక, అంకితలు మాత్రం నిలకడగా గురి చూసి బాణం విసరలేకపోయారు.
ఈ ఇద్దరూ మరీ ఆధ్వాన్నంగా 4, 6 పాయింట్లతో అందర్నీ షాక్‌కు గురి చేశారు.
మరోవైపు డచ్ త్రయం క్వింటీ రొఫ్ఫెన్, గాబి స్కొలెస్సర్, లారా వాన్ డెర్ వింకెల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
మూడు రౌండ్లలో వెనకబడిన భారత ఆర్చరీ త్రయం 51-52, 49-54, 48-54తో ఓటమి మూటగట్టుకుంది.