పతక వేటలో.. మన మెరుపులు
– పారిస్ ఒలింపిక్స్ మరో 7రోజుల్లో
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించేందుకు.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకంతో మెరిసేందుకు.. పారిస్లో మన సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. పతకాలు గెలిచి.. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తేవడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది మంది మన అథ్లెట్లు పతక వేటకు వెళ్లబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున పీవీ సింధు, సాత్విక్ (బ్యాడ్మింటన్), జ్యోతి యర్రాజి, దండి జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ).. తెలంగాణ నుంచి నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్)
ఈ విశ్వ క్రీడల్లో తలపడబోతున్నారు.