అనుమానాలకు ఫుల్‌స్టాప్..
– సిన్ నదిలో పారిస్ మేయర్ స్విమ్మింగ్
పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ అక్కడి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
గత జూన్‌లో జరిపిన నీటి పరీక్షలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అయితే అప్పటికి ఇప్పటికీ నీటిలో తేడా వచ్చిందని చెప్పేందుకు మేయర్ స్వయంగా రంగంలోకి దిగింది. తన ఆఫీస్ ఉన్న సిటీ హాల్ దగ్గర నదిలో ఈతకు దిగిన హిడాల్గో నోట్రెడెమ్ క్యాథ్రెడెల్ వరకు స్విమ్మింగ్ చేసింది.
ఓపెన్ స్విమ్మింగ్ పోటీలకు నదిలో నీరు అనుకూలంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మేయర్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఇందుకోసం సిన్ నదిపై ఫ్రాన్స్ ప్రభుత్వం 1.5 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం విశేషం