Search for:
  • Home/
  • Breaking/
  • బోనస్‌ నాక్కూడా వద్దు!

బోనస్‌ నాక్కూడా వద్దు!

ముంబై: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ సైతం మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ బాటలోనే నడిచాడు. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన క్యాష్‌ప్రైజ్‌ రూ.125 కోట్లలో తన వాటాకు వచ్చిన బోనస్‌(రూ. 5 కోట్లు)ను సపోర్ట్‌ స్టాఫ్‌కు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

బీసీసీఐ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, కోచింగ్‌ స్టాఫ్‌కు రూ.2.5 కోట్లు, ఇతర సహాయక సిబ్బందికి కోటి రూపాయల చొప్పున ఇవ్వడంపై రోహిత్‌ అసంతృప్తిగా ఉన్నాడని వినికిడి.