Search for:
  • Home/
  • Breaking/
  • నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది..

నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది..

బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు థాంక్స్‌: ఎంఎస్ ధోనీ
భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచింది.

టీమ్‌ఇండియాకు వరల్డ్‌ కప్‌ను అందించిన మూడో సారథిగా రోహిత్‌ చరిత్రలో నిలిచిపోయాడు.

ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup) నెగ్గిన తర్వాత భారత్‌కు రెండో కప్‌ దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్‌ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను టీమ్ఇండియా ఒడిసిపట్టింది.దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ విజయం సాధించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.తొలిసారి టీ20 ప్రపంచకప్‌ అందించిన ‘కెప్టెన్‌ కూల్‌’ ధోనీ ఏమని స్పందించాడనేది ఆసక్తికరమే కదా! భారత విజయం సాధించిన తర్వాత అతడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడది వైరల్‌గా మారిపోయింది.‘‘వరల్డ్‌ కప్‌ 2024 ఛాంపియన్స్‌. ఈ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ పెరిగిపోయింది.నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్‌ కప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. విలువ కట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ధోనీ పోస్టు పెట్టాడు.జులై 7న ధోనీ బర్త్‌డే. దానిని ప్రస్తావిస్తూ అలా పెట్టాడని అభిమానులు కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఇది కూడా ‘తలా’ కోసమే అన్నట్లుగా నెట్టింట చర్చ మొదలైంది. ఎందుకంటే ధోనీ జెర్సీ నెంబర్‌ 7.