ఆటను మరిచి.. వ్యాపారంపై దృష్టి?
- గిల్‌పై క్రమశిక్షణ చర్య!
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్వదేశానికి రానున్నాడు. అయితే క్రమశిక్షణ చర్యల కారణంగానే అతడిపై బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందన్న కథనాలు వెలువడ్డాయి. అమెరికాలో అడుగుపెట్టాక గిల్ జట్టుతో ఉండకుండా, ప్రాక్టీ్‌సకు రాకుండా వ్యక్తిగత బిజినెస్ ప్రాజెక్ట్‌లపై ఎక్కువగా దృష్టి సారించాడని సమాచారం. పాకిస్థాన్‌తో మ్యాచ్ సమయంలోనూ ఇతర రిజర్వ్ ప్లేయర్లు రింకూ, అవేశ్, ఖలీల్ కనిపించినా.. గిల్ మాత్రం ఎక్కడా లేడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్-గిల్ మధ్య వాగ్వాదం జరిగిందని, అందుకే రోహిత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడని అంటున్నారు. US లో మ్యాచ్‌లు ముగిశాయి కాబట్టి ఆదివారం గిల్‌తో పాటు అవేశ్ ఖాన్ స్వదేశానికి వస్తుండగా.. రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ అక్కడే ఉండనున్నారు. మరోవైపు ఇలాంటి కథనాలు అవాస్తవమని, గిల్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.