Search for:
  • Home/
  • Breaking/
  • ఫ్లెమింగ్‌ని ఒప్పించడానికి..!

ఫ్లెమింగ్‌ని ఒప్పించడానికి..!

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషణ ఇప్పటికే మొదలైంది.

టీ20 ప్రపంచకప్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో మరొకరిని నియమించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.

అయితే కొందరితో బీసీసీఐ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చాలా ఏళ్ల నుంచి కోచ్‌గా పని చేస్తున్న ఫ్లెమింగ్‌ను ప్రధాన కోచ్‌ పదవి చేపట్టేలా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అవసరమైతే చెన్నై మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని రంగంలోకి దింపి ఫ్లెమింగ్‌ను ఒప్పించాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే 3 ఏళ్ల పాటు కోచ్‌ పదవిలో ఉండటానికి ఈ న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ సుముఖంగా లేడట. అతడు ఐపీఎల్‌తో పాటు టెక్సాస్‌ సూపర్‌కింగ్స్, మేజర్‌ లీగ్‌ క్రికెట్, ద హండ్రెడ్‌ లీగ్స్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనను ఫ్లెమింగ్‌ అంగీకరిస్తే ఈ ఫ్రాంఛైజీలకు దూరం కావాల్సి ఉంటుంది. ‘‘భారత కోచ్‌ పదవిని చేపట్టను అని ఫ్లెమింగ్‌ చెప్పలేదు. తన టీ20 కాంట్రాక్ట్‌ల విషయాన్ని తెలిపాడు.

ఆరంభంలో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఇలాగే అన్నాడు. ఫ్లెమింగ్‌ను ఒప్పించాలంటే ధోనిని మించినవాళ్లు ఇంకెవరుంటారు?’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.