రోయింగ్‌లో భారత్‌కు తొలి బెర్తు
చుంగ్జు: రోయింగ్ క్రీడలో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో దేశానికి తొలి బెర్తు దక్కింది. దక్షిణ కొరియాలోని చుంగ్జు వేదికగా జరుగుతున్న 2024 వరల్డ్ ఆసియన్ అండ్ ఒషియానియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన 25 ఏండ్ల బాల్రాజు పన్వర్.. 2000 మీటర్ల పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్‌కు బెర్తును ఖాయం చేశాడు.
ఈ పోటీలలో భాగంగా 7 నిమిషాల 1.27 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసిన అతడు మూడో స్థానంలో నిలవడంతో ఒలింపిక్ కోటాను దక్కించుకున్నాడు.