చెన్నై జోరు..
- ఐపీఎల్ తొలి పోరులో ఘన విజయం
- 6 వికెట్లతో బెంగళూరు ఓటమి
- ముస్తఫిజుర్‌కు 4 వికెట్లు
చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు.