15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై..
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ నూర్ అలీ
ఆఫ్గానిస్తాన్ వెటరన్ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నూర్ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్.. 2019లో స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డేతో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
జద్రాన్ అఫ్గానిస్తాన్ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో జద్రాన్ ఓవరాల్‌గా 1902 పరుగులు అలీ సాధించాడు. అందులో 1216 పరుగులు వన్డే ఫార్మాట్‌లో సాధించినివే కావడం గమనార్హం. టీ20ల్లో 597 పరుగులు చేశాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లోనూ జద్రాన్ అఫ్గాన్ జట్టులో భాగమయ్యాడు.
ఈ ఈవెంట్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌లపై హాఫ్ సెంచరీలతో జద్రాన్ చెలరేగాడు. అతడు చివరగా అఫ్గాన్ తరపున ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. అదే విధంగా జద్రాన్ 2010 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీతో మెరిశాడు.