నిహార్ పసిడి ధమాకా
-ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్
గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర యువ సైక్లిస్ట్ సాయి నిహార్ బిక్కిన అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 400మీటర్ల మెడ్లె ఈవెంట్లో నిహార్ పసిడి పతకంతో మెరిశాడు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరును నిహార్(కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ) 4:45:01 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మణికంఠ(జైన్ యూనివర్సిటీ), ఆర్యన్ భోంస్లే(యూనివర్సిటీ ఆఫ్ ముంబై) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇది వరకే టోర్నీలో స్వర్ణం సొంతం చేసుకున్న నిహార్ రెండు రజత పతకాలు ఖాతాలో వేసుకున్నాడు