Search for:
  • Home/
  • Breaking/
  • సీఎం రేవంత్‌తో జాతీయ సాకర్‌ చీఫ్‌ భేటీ

సీఎం రేవంత్‌తో జాతీయ సాకర్‌ చీఫ్‌ భేటీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలోని సీఎం కార్యాలయంలో రేవంత్‌ రెడ్డితో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) అధ్యక్షుడు కల్యాణ్‌ చౌబే బృందం భేటీ అయింది. వచ్చే జూన్‌ 6వ తేదీన దేశంలో నిర్వహించాల్సిన భారత్‌, కువైట్‌ జట్ల మధ్య క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని రేవంత్‌ను కల్యాణ్‌ కోరారు. దీనిపై రేవంత్‌ స్పందిస్తూ.. ఈ ఫిఫా మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యత మొత్తం తెలంగాణ సర్కార్‌ తీసుకుంటుందని, మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకారమందిస్తుందని హామీ ఇచ్చారు.