Search for:
  • Home/
  • Breaking/
  • న్యూజిలాండ్‌ నయాచరిత్ర

న్యూజిలాండ్‌ నయాచరిత్ర

2-0తో సఫారీలను చిత్తుచేసి..

విలియమ్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు నయా చరిత్ర లిఖించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికాపై సిరీస్‌ గెలువని కివీస్‌.. ఈ సారి ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శుక్రవారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుచేసి 2-0తో సిరీస్‌ పట్టేసింది. 267 పరుగుల లక్ష్యఛేదనలో.. ఓవర్‌నైట్‌ స్కోరు 40/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ 3 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి గెలుపొందింది. మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (133 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో సెంచరీతో చెలరేగగా.. విల్‌ యాంగ్‌ (60 నాటౌట్‌) అతడికి సహకరించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేయగా. న్యూజిలాండ్‌ 211 రన్స్‌ కొట్టింది. దేశవాళీ టీ20 లీగ్‌ సాగుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు దక్షిణాఫ్రికా బోర్డు ద్వితీయశ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 3 సెంచరీలు సహా 403 రన్స్‌ చేసిన విలియమ్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కింది.