మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే..
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని.. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదల ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ సింగ్ ధుమాల్ స్పష్టం చేశాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ఖరారు చేసిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలవుతుందని ధుమాల్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఇతర దేశానికి తరలి వెళ్తుందన్న ప్రచారం జరుగుతున్న వేల లీగ్ చైర్మన్ హామీ ఇచ్చాడన్న వార్త భారతీయ క్రికెట్ అభిమానులకు భారీ ఊరట కల్గిస్తుంది.
సాధారణంగా భారతలో ఎన్నికలు మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ తొలి భాగంలో కాని జరుగుతాయి కాబట్టి.. ఈ మధ్య తేదీలను ఐపీఎల్ 2024 ప్రారంభ తేదీగా ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దేశంలో అత్యంత విశ్వసనీయత కలిగిన వార్తా సంస్థ కథనం మేరకు ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై, మే 26వ తేదీతో ముగుస్తుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే,భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పటికీ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టేశాయి. ట్రైనింగ్ క్యాంప్‌లు ప్రారంభించి టెస్ట్ జట్టులో లేని ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్స్ కొనసాగిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లాంటి ఐపీఎల్ స్టార్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు.