టీ20 ప్రపంచకప్‌లో రోహితే కెప్టెన్
రాజ్‌కోట్: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మనే టీమ్ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. ‘‘వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్ గెలవలేకపోయినా, మనసులు గెలిచాం.
2024 (టీ20 ప్రపంచకప్)లో బార్బడోస్ (ఫైనల్ వేదిక)లో రోహిత్ సారథ్యంలో భారత పతాకం ఎగురవేస్తాం’’ అని షా అన్నాడు. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌కు విండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా స్టేడియంగా మార్చారు.
ఈ కార్యక్రమంలో జై షాతో పాటు.. మాజీ కెప్టెన్లు గావస్కర్, కుంబ్లే, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అగార్కర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్, సిరాజ్, జడేజా, అక్షర్ పటేల్ కూడా పాల్గొన్నారు.