హైదరాబాద్‌లో ఎఫ్ఐఎమ్ వరల్డ్‌కప్
ముంబై: ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఎమ్ ఈ-ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్ సీజన్-2కు భారత్‌లో తొలిసారి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. 2024 షెడ్యూల్‌ను అనుసరించి ఇప్పటికే ఒసాకా(జపాన్) వేదికగా ఈ నెల 16, 17తేదీల్లో మొదటి రౌండ్ జరుగనుండగా, నార్వే (రౌండ్-2, మే 3-4), ఫ్రాన్స్(రౌండ్-3, జూన్ 21-23), స్విట్జర్లాండ్ (రౌండ్-4, సెప్టెంబర్ 20-22), హైదరాబాద్(రౌండ్-5, నవంబర్ 29, డిసెంబర్ 1) పోటీలు ఉండనున్నాయి.
ఈ విషయాన్ని భారత్ తరఫున బరిలోకి దిగుతున్న ఇండీ రేసింగ్ టీమ్ యజమాని అభిషేక్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు. దేశంలో తొలిసారి జరుగబోతున్న ఈ-మోటార్ రేసింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇండీ రేసింగ్ టీమ్‌లో సాండ్రా గోమెజ్, స్పెన్సర్ విల్టన్ పోటీకి దిగుతున్నారు.