ఆడుదాం ఆంధ్రా …
విశాఖలో ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్
మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు.
కాగా సీఎం జగన్.. నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.