✨హైదరాబాద్‌లో ఫిఫా అర్హత మ్యాచ్
హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) కార్యదర్శి జీపీ ఫాల్గుణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ తొలిసారి ఫిఫా అర్హత పోరుకు వేదికవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఫాల్గుణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని సీఎంను కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఫాల్గుణ తెలిపారు.