ఛత్తీస్‌గఢ్‌తో రంజీ.. పట్టుబిగించిన ఆంధ్ర
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌పై ఆంధ్ర పట్టుబిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 118/3తో మూడో రోజు, ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్ 262 పరుగులకు ఆలౌటైంది. అమన్‌దీప్ (54), సంజీత్ (54) అర్ధశతకాలు సాధించారు. పృథ్వీరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గిరినాథ్ రెడ్డి, శశికాంత్, అశ్విన్ హెబ్బర్ తలో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. 169 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆంధ్ర.. రెండో ఇన్నింగ్స్‌లో 150/2 వద్ద డిక్లేర్ చేసింది. కరణ్ షిండే (45), అశ్విన్ హెబ్బర్ (33 నాటౌట్) రాణించారు. 320 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఛత్తీస్‌గఢ్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 431 పరుగులు సాధించింది.