ఖేలో ఇండియాలో తెలంగాణ హవా
హైదరాబాద్:
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ప్లేయర్లు మూడు స్వర్ణాలు సాధించారు. తొలుత బాలుర ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో తనిష్క్ మురళీధర్ నాయుడు స్వర్ణం సాధించాడు. అనంతరం హైదరాబాద్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో పసిడితో మెరిసింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ టేబుల్ విభాగంలో నిషిక అగర్వాల్ స్వర్ణం కొల్లగొట్టింది. ఓవరాల్ ఈ పోటీల్లో తెలంగాణ 9 స్వర్ణాలు సహా మొత్తం 15 మెడల్స్‌తో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.