డాకర్ ర్యాలీలో హీరో రేసర్‌కు రెండో స్థానం
యాన్బు (సౌదీ అరేబియా): హీరో మోటోస్పోర్ట్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక డాకర్ ర్యాలీని ఆ జట్టు రేసర్ రాస్ బ్రాంచ్ రెండో స్థానంతో ముగించాడు. డాకర్ ర్యాలీలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా హీరో మోటోస్పోర్ట్స్ రికార్డు నెలకొల్పింది. మరోవైపు ర్యాలీ 2లో భారత్‌కు చెందిన షెర్కో టీవీఎస్ ర్యాలీ ఫ్యాక్టరీకి చెందిన రేసర్ హరిత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ విభాగంలోనూ ఈ ఘనత సాధించిన భారత తొలి రేసర్ హరితే.