సాత్వి క్–చిరాగ్ జోడీదే టైటిల్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్వి క్–చిరాగ్ 21–11, 21–17తో లీ జె హుయ్–పో సువాన్ యాంగ్ [...]