Search for:

గోల్డ్‌ మెడల్‌ ఖరీదు ఎంతంటే..!

Paris Olympics-2024 ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తున్న పసిడి పతకం తయారు చేసేందుకు భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు ఖర్చు అవుతుంది. 1912 స్టాక్‌హోమ్‌ ఒలింపిక్స్‌ వరకు పసిడి పతకాలంటే పూర్తిగా బంగారంతోనే చేసేవారు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత [...]

భారత్‌ ఖాతాలో మూడో పతకం

Paris Olympics 2024: భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత్‌ తరఫున స్వప్నిల్‌ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్‌ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్‌లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల [...]

ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు

Paris Olympics-2024 పారిస్‌: పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో రెండో మెడ‌ల్ కొట్టింది ఇండియా. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు కాంస్య ప‌త‌కం ల‌భించింది. షూట‌ర్ మ‌నూ భాక‌ర్ ఖాతాలో మ‌రో మెడ‌ల్ ప‌డింది. మిక్స్‌డ్ టీమ్‌లో మ‌నూ భాక‌ర్‌తో పాటు స‌ర‌బ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంట‌పై భార‌త షూట‌ర్లు మేటి ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ మెడ‌ల్‌తో షూట‌ర్ మ‌నూ భాక‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. [...]

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం..

షూటింగ్‌లో కాంస్యం సాధించిన మను బాకర్‌.. శాతోహు (ఫ్రాన్స్‌): పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. యువ షూటర్‌ మను బాకర్‌ 10మీ ఎయిర్‌పిస్టల్‌లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా సృష్టించింది. [...]

పారిస్‌ ఒలింపిక్స్‌లో అదరగొట్టేనా?

– పతక రేసులో అవినాశ్‌ సాబ్లె, పారుల్‌, జ్యోతి – నీరజ్‌పై భారీ అంచనాలు మరో వారం రోజుల్లో తెరలేవనున్న పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం వచ్చే ఈవెంట్లలో అథ్లెటిక్స్‌ ఒకటి. టోక్యో ఒలింపిక్స్‌ (2020)లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో భాగంగా జావెలిన్‌ త్రో విభాగంలో పసిడి గెలుచుకున్న నీరజ్‌ చోప్రా.. మరోసారి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని దేశం కోరుకుంటోంది. గత మూడేండ్లుగా నిలకడగా రాణిస్తున్న నీరజ్‌ [...]

అనుమానాలకు ఫుల్‌స్టాప్‌..

– సిన్‌ నదిలో పారిస్‌ మేయర్‌ స్విమ్మింగ్‌ పారిస్‌: ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ అక్కడి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా సిన్‌ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్‌ మేయర్‌ అన్నె హిడాల్గో ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది. గత జూన్‌లో జరిపిన నీటి పరీక్షలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అయితే అప్పటికి ఇప్పటికీ నీటిలో [...]

భారత్‌ నుంచి 117 మంది..

విశ్వ క్రీడలలో.. ఏ విభాగంలో ఎందరు? ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది. క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడాకారుల జాబితాలో షాట్‌ పుట్టర్‌ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం. *అభా పేరు [...]

అర్జెంటీనాదే కోపా అమెరికా

✓ కొలంబియాపై ఉత్కంఠ గెలుపు✓ 16వ సారి టైటిల్‌ కైవసం మియామి: అమెరికా వేదికగా జరిగిన ‘కోపా అమెరికా’ టైటిల్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా నిలబెట్టుకుంది. ఇక్కడి హార్డ్‌రాక్‌ స్టేడియం వేదికగా జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరొ మార్టినెజ్‌ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఈ టోర్నీ చరిత్రలో ఏకంగా 16వ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తన కెరీర్‌లో చివరి [...]

కింగ్‌ అల్కారజ్‌

– ఫైనల్‌లో జొకోవిచ్‌పై విజయం – వరుసగా రెండో ఏడాది టైటిల్‌ కైవసం అదే కోర్టు! వాళ్లే ప్రత్యర్థులు!! కానీ ఫలితం మాత్రం మారలేదు. గతేడాది వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌కు రీమ్యాచ్‌గా ఆదివారం ముగిసిన తుదిపోరులోనూ స్పెయిన్‌ కుర్రాడు కార్లొస్‌ అల్కారజ్‌ అదరగొట్టి వింబుల్డన్‌ కోటలో మరోసారి పాగా వేశాడు. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో 25వ [...]

గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా .. యూరో కప్ 2024 ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై స్పెయిన్ జట్టు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో టోర్నీ చరిత్రలో నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో గెలిచి సరికొత్త రికార్డు [...]