వెయింగ్ రూల్స్‌లో మార్పులు?
న్యూఢిల్లీ: వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు క్రీడావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రెజ్లర్ల వెయింగ్ (బరువు తూచడం) విషయంలో మార్పులు చేయాలని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అథ్లెట్ల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేసే నిబంధనల సడలింపులు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తాయని భావిస్త్తున్నారు. తన కేటగిరీలో కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో తనను ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు [...]