Search for:

అందుకే రోహిత్‌ను తప్పించాం

[7:01 am, 07/02/2024] +91 83176 57125: ముంబయి: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యకు పగ్గాలు అప్పగించడంపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రోహిత్‌ ఇప్పటివరకూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ముంబయి ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ స్పందించాడు. రోహిత్‌పై ఒత్తిడిని తగ్గించడానికే కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్‌కు ఇచ్చామని ఓ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. ‘‘బ్యాటుతో గత రెండు సీజన్లలో రోహిత్‌ [...]

శ్రమించి… ఛేదించి…

ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్‌ ఉదయ్‌ సహారణ్‌కు జతయిన సచిన్‌ దాస్‌ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్‌ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్‌ పోరుకు అర్హత పొందింది. [...]

వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. మరొక 21 బంతుల్లోనే మిగతా 21 పరుగులు చేసిన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. షోయబ్ బషీర్ వేసిన 102వ ఓవర్లో వరుసగా సిక్సు, [...]

ఏంటీ ‘టాంగివై షీల్డ్‌’..! సఫారీ-కివీస్‌ల టెస్టు సిరీస్‌ విజేతకు ఇచ్చే ట్రోఫికి ఈ పేరెందుకు..?

స్వదేశంలో భారత్‌తో మూడు ఫార్మాట్‌ల సిరీస్‌లు ఆడిన దక్షిణాఫ్రికా త్వరలోనే న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈనెల 4 నుంచి కివీస్‌.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో గెలిచిన విజేతకు ఇచ్చే ట్రోఫీని ‘టాంగివై షీల్డ్‌’ అని పిలుస్తున్నారు. విజేతలకు అందజేసే ఈ షీల్డ్‌ వెనుక ఓ విషాద కథ ఉంది. టెస్టు సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో టాంగివై షీల్డ్‌ కథా కమామీషు ఇక్కడ చూద్దాం. [...]

సర్ఫరాజ్‍ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు

దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. దీంతో దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది. కాగా రెండో టెస్టుకు భారత స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఈ క్రమంలో [...]

ఆంధ్ర ఘన విజయం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర 126 పరుగులతో ఘన విజయం సాధించింది. 320 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 20/0తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్‌ 193 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్‌, నితీశ్‌ చెరో మూడేసి, పృథ్వీరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఏపీకి ఆరు పాయింట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 431, రెండో ఇన్నింగ్స్‌లో 150/2 [...]

ఐదో స్థానానికి భారత్‌

దుబాయ్‌: తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ ఆరంభంలో పట్టు కనబర్చిన రోహిత్‌ సేన.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్‌ డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌ ప్లేస్‌ చేజిక్కించుకోగా.. తాజా ఫలితంతో బంగ్లాతర్వాతి స్థానానికి చేరింది. [...]

లంక క్రికెట్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐసీసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేత..

శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్‌లో శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ)పై విధించిన నిషేధాన్ని తాజాగా ఐసీసీ ఎత్తివేసింది. గత కొంతకాలంగా లంక క్రికెట్‌ బోర్డుపై ఓ కన్నేసి ఉంచిన ఐసీసీ.. బోర్డు తీసుకుంటున్న చర్యలపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్‌ ఫెర్నాండో ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది [...]

ఛత్తీస్‌గఢ్‌తో రంజీ.. పట్టుబిగించిన ఆంధ్ర

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌పై ఆంధ్ర పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 118/3తో మూడో రోజు, ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్‌ 262 పరుగులకు ఆలౌటైంది. అమన్‌దీప్‌ (54), సంజీత్‌ (54) అర్ధశతకాలు సాధించారు. పృథ్వీరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గిరినాథ్‌ రెడ్డి, శశికాంత్‌, అశ్విన్‌ హెబ్బర్‌ తలో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. 169 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆంధ్ర.. రెండో ఇన్నింగ్స్‌లో 150/2 వద్ద డిక్లేర్‌ చేసింది. [...]

తలైవాస్‌ గెలుపు

పట్నా: పీకేఎల్‌లో ఆదివారం తమిళ్‌ తలైవాస్‌ 50-34తో యు ముంబాపై విజయం సాధించింది. తలైవాస్‌ జట్టులో నరేందర్‌ (13), అజింక్య (10) సత్తా చాటారు. యు ముంబా తరఫున గుమన్‌ సింగ్‌ (13) రాణించాడు. జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, బెంగళూరు బుల్స్‌ మధ్య మ్యాచ్‌ 28-28తో టైగా ముగిసింది. [...]