Search for:

వన్డేలు, టీ20ల్లో స్టాప్‌క్లాక్‌

– టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌డేలు – ఐసీసీ కీలక నిర్ణయాలు దుబాయ్‌: క్రికెట్‌లో త్వరలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి వన్డేలు, టీ20ల్లో వృథా సమయాన్ని అరికట్టేందుకు ఐసీసీ స్టాప్‌క్లాక్‌ నిబంధనను తీసుకొచ్చింది. వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జూన్‌ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌ నుంచి ఈ నిబంధన అధికారికంగా అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఒక [...]

ఐపీఎల్‌ ఆరంభం అదుర్స్.

. చెన్నైలో చిందేసిన ఫ్యాన్స్‌🥳 ఐపీఎల్‌ 17 సీజన్‌ ఆరంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను అలరించాయి. బాలీవుడ్‌ అగ్రతారలు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ తమ నృత్యాలతో చెపాక్‌ స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. అక్షయ్‌ ఎంట్రీ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ భారత జాతీయ పతాకాన్ని చేతబూని స్టేడియం అంతా బైక్‌పై కలియతిరిగారు. అనంతరం ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌, మోహిత్‌ చౌహన్‌, ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ [...]

భారత జట్లకు కఠినమైన డ్రా

– థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ దిల్లీ: థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌లో భారత పురుషులు, మహిళల జట్లకు కఠినమైన డ్రా ఎదురైంది. శుక్రవారం బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన డ్రాలో థామస్‌ కప్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత పురుషుల జట్టుకు గ్రూపు-సిలో చోటు దక్కింది. 14 సార్లు విజేత, నిరుటి రన్నరప్‌ ఇండోనేసియాతో పాటు థాయ్‌లాండ్‌, ఇంగ్లాండ్‌ గ్రూపు-సిలో ఉన్నాయి. 2022 బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ 3-0తో ఇండోనేసియాను చిత్తుచేసి [...]

పంత్‌.. రైట్‌ రైట్‌

దిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతను దాదాపు 15 నెలల విరామం తర్వాత పోటీ క్రికెట్లోకి అడుగు పెడుతున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎట్టకేలకు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన అతను.. ఈ ఐపీఎల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. పంత్‌ బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా చేయడానికి తగ్గ ఫిట్‌నెస్‌ [...]

జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

దుబాయ్‌: భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌..ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 712 పరుగులు చేయడం ద్వారా భారత విజయంలో జైస్వాల్‌ కీలకంగా వ్యవహరించాడు. సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన జైస్వాల్‌ మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కొల్లగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ [...]

సచిన్‌ రికార్డు బద్దలు

చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ తమ్ముడు.. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్‌ ఖాన్‌.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్‌ ఖాన్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో [...]

చిన్నస్వామిలో మ్యాచ్‌లు కష్టమేనట..!

బెంగళూరులో నీటి కటకట.. కన్నడ రాజధాని బెంగళూరులో నీటి కష్టాలతో ఐటీ క్యాపిటల్‌ ఆగమాగం అవుతోంది. గార్డెన్‌ సిటీలో ప్రజలకు వేసవికాలం మొదలుకాకముందే తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో బోర్లు నోర్లు తెరుచుకోగా ట్యాంకర్లయినా తెప్పించుకుందామనుకున్నా అవీ దొరకడం లేదు. ప్రజలు వంట పాత్రలకు ఎక్కువనీటిని వాడొద్దని, వీలైతే వాటిని కడగడం పూర్తిగా మానేయాలని, స్నానాలు కూడా అతిగా చేయొద్దని ఇప్పటికే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకు [...]

సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లిన జై షా

బీసీసీఐ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అనుకుంటున్నారా..? BCCI | ఎవ్వరు పడితే వాళ్లు వచ్చి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పెట్టుబడులు పెడతామంటే కుదురదని, అందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కాదని జై షా స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టాలని గత రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్న సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లుతూ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల [...]

సత్తా చాటిన విశాఖ అమ్మాయి..

గుజరాత్‌ను గెలిపించిన షబ్నమ్‌ షకీల్‌ మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్‌ జెయింట్స్‌కు విశాఖ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ బ్రేక్‌ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్‌ తన మీడియం పేస్‌ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు [...]

15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై..

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌ నూర్‌ అలీ ఆఫ్గానిస్తాన్‌ వెటరన్‌ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నూర్‌ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్‌.. 2019లో స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డేతో అఫ్గాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్‌ అఫ్గానిస్తాన్‌ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన [...]