Search for:

బోనస్‌ నాక్కూడా వద్దు!

ముంబై: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ సైతం మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ బాటలోనే నడిచాడు. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన క్యాష్‌ప్రైజ్‌ రూ.125 కోట్లలో తన వాటాకు వచ్చిన బోనస్‌(రూ. 5 కోట్లు)ను సపోర్ట్‌ స్టాఫ్‌కు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. బీసీసీఐ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, కోచింగ్‌ స్టాఫ్‌కు రూ.2.5 కోట్లు, ఇతర సహాయక సిబ్బందికి కోటి రూపాయల చొప్పున ఇవ్వడంపై రోహిత్‌ అసంతృప్తిగా ఉన్నాడని వినికిడి. [...]

మేము రాం!

ఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో హైబ్రిడ్‌ మోడల్‌ తప్పేలా లేదు. ఏడేండ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆడేందుకు గాను దాయాది దేశం వెళ్లడానికి భారత్‌ నిరాకరించడమే ఇందుకు కారణం! ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లేది లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీమ్‌ఇండియా పాక్‌లో పర్యటిస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న [...]

భారత కోచ్‌గా గంభీర్‌..

బీసీసీఐ అధికారిక ప్రకటన ముంబై: భారత క్రికెట్‌లో గౌతం గంభీర్‌ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పదవీకాలం ముగియడంతో గంభీర్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొంది. అశోక్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని అడ్వైజరీ [...]

నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది..

బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు థాంక్స్‌: ఎంఎస్ ధోనీభారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియాకు వరల్డ్‌ కప్‌ను అందించిన మూడో సారథిగా రోహిత్‌ చరిత్రలో నిలిచిపోయాడు. ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup) నెగ్గిన తర్వాత భారత్‌కు రెండో కప్‌ దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్‌ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను టీమ్ఇండియా ఒడిసిపట్టింది.దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో చివరి ఓవర్‌ [...]

విశ్వవిజేత భారత్‌ టీ20 ప్రైజ్‌మనీ ఎంతంటే ⁉️ పదకొండేళ్ల తర్వాత భారత్‌ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌ లో విశ్వవిజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత [...]

ఆటను మరిచి.. వ్యాపారంపై దృష్టి?

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉన్న భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ స్వదేశానికి రానున్నాడు. అయితే క్రమశిక్షణ చర్యల కారణంగానే అతడిపై బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందన్న కథనాలు వెలువడ్డాయి. అమెరికాలో అడుగుపెట్టాక గిల్‌ జట్టుతో ఉండకుండా, ప్రాక్టీ్‌సకు రాకుండా వ్యక్తిగత బిజినెస్‌ ప్రాజెక్ట్‌లపై ఎక్కువగా దృష్టి సారించాడని సమాచారం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సమయంలోనూ ఇతర రిజర్వ్‌ ప్లేయర్లు రింకూ, అవేశ్‌, ఖలీల్‌ కనిపించినా.. గిల్‌ మాత్రం ఎక్కడా [...]

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌..

అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్‌) చివరి వారంలో గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్‌ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల [...]

ఫ్లెమింగ్‌ని ఒప్పించడానికి..!

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషణ ఇప్పటికే మొదలైంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో మరొకరిని నియమించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే కొందరితో బీసీసీఐ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చాలా ఏళ్ల నుంచి కోచ్‌గా పని చేస్తున్న ఫ్లెమింగ్‌ను ప్రధాన కోచ్‌ పదవి చేపట్టేలా ఒప్పించే [...]

టీమిండియా హెడ్‌ కోచ్ ప‌ద‌విపై

హర్భజన్ ఆసక్తి..? టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్‌ లాంగర్‌, గౌతం గంభీర్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, పాంటింగ్‌ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో [...]

చెన్నై జోరు..

చెన్నై: ఐపీఎల్‌–2024ను సూపర్‌ కింగ్స్‌ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్‌ రావత్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు [...]