Search for:

పాకిస్తాన్‌కు వస్తారా? లేదా?..

ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పాక్‌ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ [...]

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

అక్టోబర్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్‌ బౌలర్‌ నౌమన్‌ అలీ, న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌, సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్‌ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్‌కప్‌ టాప్‌ పెర్ఫార్మర్లు అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌), డియాండ్రా డొట్టిన్‌ (వెస్టిండీస్‌), లారా వోల్వార్డ్ట్‌ (సౌతాఫ్రికా) నామినేట్‌ అయ్యారు. నౌమన్‌ [...]

పారా అథ్లెట్లకు ఆర్థిక సాయం హైదరాబాద్‌ : పారిస్‌ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులు, వారి కోచ్‌లకు తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌ కుమార్తె రమ్య రూ. 20 లక్షలు ఆర్థిక సాయం అందించారు.వరంగల్‌ అథ్లెట్‌ దీప్తితో పాటు తులసీమతి మురుగేశన్‌, నితీశ్‌కుమార్‌కు తలో రూ.5 లక్షలు, కోచ్‌ నాగపురి రమేశ్‌ సిబ్బందికి రూ.5 లక్షలు నగదు ప్రోత్సాహకంగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ [...]

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి బంపర్ ఆఫర్..!

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్‌ కు బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్ రాబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఇటీవల దులీప్ ట్రోఫీ 2024 సందర్భంగా ముషీర్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఆ క్రమంలో తొలి మ్యాచ్‌లోనే ముషీర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో ముషీర్ నిరంతరం అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ముషీర్ రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి ఇప్పుడు [...]

కోచ్‌లపై అతిగా ఆధారపడొద్దు

రవిచంద్రన్‌ అశ్విన్‌ కెరీర్‌లో ఎదగాలంటే సొంత బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టాలని… ప్రతీదానికి కోచ్‌లను ఆశ్రయించే పనికి స్వస్తి చెప్పాలని భారత సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అలా చేయడం వల్ల యువ ఆటగాళ్లు కొత్తగా ఆలోచించడం మానేసి ఒక్క చోటనే ఆగిపోతారని అతను అభిప్రాయపడ్డాడు. అవతలి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో నేర్చుకునే సాకుతో ‘అతుక్కుపోయే’ గుణం తనకు ఏమాత్రం నచ్చదని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 14 [...]

జై షాకు ఎదురులేనట్లే..!

ముంబయి: బీసీసీఐ కార్యదర్శిగా వరుసగా రెండో పర్యాయం కీలక పాత్ర పోషిస్తున్న జై షాను త్వరలో ఐసీసీ ఛైర్మన్‌గా చూడబోతున్నామా? ఔననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. రెండోసారి ఛైర్మన్‌గా కొనసాగుతున్న గ్రెగ్‌ బార్క్‌లే పదవీ కాలం నవంబరు 30తో ముగియనుండగా.. ఆయన మూడో పర్యాయం బరిలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఖాళీ అవుతున్న స్థానానికి ప్రస్తుతం జై షా పేరే గట్టిగా వినిపిస్తోంది. షాను ఛైర్మన్‌గా చేయడానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి [...]

బంగ్లా, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు వేదికలు మార్పు

ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌తో పాటు టీమ్‌ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో ఆడనున్న సిరీస్‌ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 6న ధర్మశాల వేదికగా భారత జట్టు తొలి టీ20 ఆడాల్సి ఉండగా స్టేడియంలో మరమ్మతుల కారణంగా ఆ మ్యాచ్‌ను గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌)కు తరలించారు. మిగిలిన మ్యాచ్‌లలో మార్పులేమీ లేవు. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో [...]

తొలిసారి ఆసియా క‌ప్ విజేత‌గా శ్రీ‌లంక‌

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ ఫైన‌ల్లో ఆతిథ్య శ్రీ‌లంక జ‌య‌భేరి మోగించింది. మెగా టోర్నీలో తొలిసారి విజేత‌గా అవ‌త‌రించింది. అజేయంగా టైటిల్ పోరుకు వ‌చ్చిన భార‌త జ‌ట్టు(Team India)పై లంక 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 166 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్ చ‌మ‌రి ఆట‌ప‌ట్టు (61), హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ‌(69 నాటౌట్)లు ఉతికేశారు. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా లంక బ్యాట‌ర్ల‌కు వ‌ర‌మైంది. క‌విష దిల్హ‌రి(30 నాటౌట్)తో క‌లిసి 73 [...]

ఆసియా క‌ప్ విజేత‌గా శ్రీ‌లంక‌ మ‌హిళ‌ల ఆసియా క‌ప్ ఫైన‌ల్లో ఆతిథ్య శ్రీ‌లంక జ‌య‌భేరి మోగించింది. మెగా టోర్నీలో తొలిసారి విజేత‌గా అవ‌త‌రించింది. అజేయంగా టైటిల్ పోరుకు వ‌చ్చిన భార‌త జ‌ట్టు(Team India)పై లంక 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 166 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్ చ‌మ‌రి ఆట‌ప‌ట్టు (61), హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ‌(69 నాటౌట్)లు ఉతికేశారు. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా లంక బ్యాట‌ర్ల‌కు వ‌ర‌మైంది. క‌విష [...]

మీరు రాకుంటే మేమూ రాం..!

– చాంపియన్స్‌ ట్రోఫీలో హైబ్రిడ్‌ మోడల్‌ను వ్యతిరేకిస్తున్న పాక్‌ లాహోర్‌: వచ్చే ఏడాది తమ దేశంలో జరుగబోయే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్‌ నిరాకరించడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకుంటే 2026లో భారత్‌/శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్‌ కప్‌లో తాము ఆడబోమని హెచ్చరించినట్టు పాక్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేగాక [...]