ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
బీసీసీఐ ప్రకటించిన 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ [...]