Search for:

బజరంగ్, రవి దహియాలకు షాక్‌

సోనెపట్‌ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా… కాంస్య పతకం నెగ్గిన బజరంగ్‌ పూనియాలకు షాక్‌! పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్‌ 1–9తో రోహిత్‌ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్‌ కల్కాల్‌ గెలుపొంది ఆసియా, [...]

సాత్వి క్‌–చిరాగ్‌ జోడీదే టైటిల్‌

పారిస్‌: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్నలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంట సాత్వి క్‌–చిరాగ్‌ 21–11, 21–17తో లీ జె హుయ్‌–పో సువాన్‌ యాంగ్‌ [...]

15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై..

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌ నూర్‌ అలీ ఆఫ్గానిస్తాన్‌ వెటరన్‌ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నూర్‌ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్‌.. 2019లో స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డేతో అఫ్గాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్‌ అఫ్గానిస్తాన్‌ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన [...]

ఘనమైన ముగింపుపై భారత్‌ దృష్టి

భారత జట్టు హైదరాబాద్‌లో తొలి టెస్టును కోల్పోయిన తీరు చూస్తే నాలుగో టెస్టు ముగిసే సరికి మన జట్టు సిరీస్‌ గెలుచుకోగలదని ఎవరూ ఊహించలేదు. తర్వాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్‌ మెరుగ్గానే ఆడినా, వెనుకబడిన ప్రతీసారి కోలుకుంటూ టీమిండియా వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు సిరీస్‌ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌నూ గెలిచి ఘనంగా ముగించాలని రోహిత్‌ బృందం భావిస్తుండగా… సిరీస్‌ ఓడినా మరో మ్యాచ్‌ గెలిచి అంతరాన్ని 2–3కు [...]

ఉలిక్కిపడ్డ ఆసీస్‌ క్రికెట్‌.. బంతి తగిలి క్రికెటర్‌కు గాయం

ఆస్ట్రేలియా క్రికెట్‌ మరోసారి ఉలిక్కిపడింది. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్‌ పుకోస్కీ అనే క్రికెటర్‌ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగనప్పటికీ… ఈ ఉదంతం దివంగత ఫిల్‌ హ్యూస్‌ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో హ్యూస్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. పుకోస్కీకి తగిలిన గాయం [...]

ఇండో-పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ రూ.1.8 కోట్లా?

న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ప్రపంచ క్రికెట్‌లో ఎనలేని క్రేజ్‌. అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పలో జూన్‌ 9న న్యూయార్క్‌లో జరిగే ఈ ఇండో-పాక్‌ జట్ల మ్యాచ్‌ టిక్కెట్లకు కూడా ఊహించని డిమాండ్‌ ఏర్పడింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా మూడు కేటగిరీలుగా రూ. 14 వేల నుంచి 33 వేల వరకు (175, 300, 400 డాలర్లు) ధరలను నిర్ణయించారు. అయితే, అమ్మకాలు [...]

రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్‌

తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్‌ సాయికిషోర్‌ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్‌లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్‌లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో [...]

ఢిల్లీ ‘హ్యాట్రిక్‌’…

బెంగళూరు: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన తర్వాత క్యాపిటల్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే గుజరాత్‌ పరిస్థితి మాత్రం మరింత దిగజారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్‌ ఒక్క గెలుపు కూడా లేకుండా వరుసగా [...]

భారత బృందానికి స్వర్ణం

ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్ దిల్లీ: ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బృందం స్వర్ణం సొంతం చేసుకుంది. 4×200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే విభాగంలో ఆర్యన్‌ నెహ్రా, అనీశ్‌ గౌడ, సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరిల బృందం 7 నిమిషాల 26.64 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్‌లో నమోదైన భారత స్విమ్మర్ల అత్యుత్తమ టైమింగ్‌ (7:29.04)ను మెరుగుపరిచింది. వియత్నాం (7:29.43) జట్టుకు రజతం, థాయ్‌లాండ్‌ (7:40.37) బృందానికి [...]

కోర్టుకెక్కిన రెజ్లర్‌ బజ్‌రంగ్‌

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌ ఆపాలంటూ స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కోర్టుకెక్కాడు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించిన అతను.. ట్రయల్స్‌ ఆపాలంటూ దిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ వేశాడు. బజ్‌రంగ్‌తో పాటు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సత్యవర్త్‌ కడియన్‌ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు సమాచారం. వీళ్లంతా గత ఏడాది అప్పటి [...]