విశ్వవిజేత భారత్ టీ20 ప్రైజ్‌మనీ ఎంతంటే ⁉️ పదకొండేళ్ల తర్వాత భారత్ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత [...]
బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్..!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది. ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, [...]
ఆటను మరిచి.. వ్యాపారంపై దృష్టి?
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్వదేశానికి రానున్నాడు. అయితే క్రమశిక్షణ చర్యల కారణంగానే అతడిపై బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందన్న కథనాలు వెలువడ్డాయి. అమెరికాలో అడుగుపెట్టాక గిల్ జట్టుతో ఉండకుండా, ప్రాక్టీ్‌సకు రాకుండా వ్యక్తిగత బిజినెస్ ప్రాజెక్ట్‌లపై ఎక్కువగా దృష్టి సారించాడని సమాచారం. పాకిస్థాన్‌తో మ్యాచ్ సమయంలోనూ ఇతర రిజర్వ్ ప్లేయర్లు రింకూ, అవేశ్, ఖలీల్ కనిపించినా.. గిల్ మాత్రం ఎక్కడా [...]
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్..
అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల [...]
ఫ్లెమింగ్‌ని ఒప్పించడానికి..!
ముంబయి: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ ఇప్పటికే మొదలైంది. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో మరొకరిని నియమించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే కొందరితో బీసీసీఐ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చాలా ఏళ్ల నుంచి కోచ్‌గా పని చేస్తున్న ఫ్లెమింగ్‌ను ప్రధాన కోచ్ పదవి చేపట్టేలా ఒప్పించే [...]
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై
హర్భజన్ ఆసక్తి..? టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో [...]
రారాజు గుకేశ్..
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024 టైటిల్ కైవసం టొరంటో : భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సంచలన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024’ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ విజేతను నిర్ణయించే 14వ రౌండ్‌లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతడు 9 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి చేరి 17 ఏండ్ల వయసులోనే ఈ టోర్నీ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. [...]
భారత నంబర్‌వన్‌గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని [...]
రోయింగ్‌లో భారత్‌కు తొలి బెర్తు
చుంగ్జు: రోయింగ్ క్రీడలో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో దేశానికి తొలి బెర్తు దక్కింది. దక్షిణ కొరియాలోని చుంగ్జు వేదికగా జరుగుతున్న 2024 వరల్డ్ ఆసియన్ అండ్ ఒషియానియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన 25 ఏండ్ల బాల్రాజు పన్వర్.. 2000 మీటర్ల పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్‌కు బెర్తును ఖాయం చేశాడు. ఈ పోటీలలో భాగంగా 7 నిమిషాల 1.27 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసిన అతడు మూడో [...]
పారాలింపిక్స్‌కు వెంకటనారాయణ
ప్యాపిలి : నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అనిత (రాజస్థాన్)తో అతను దక్షిణ కొరియాలో జరిగిన పారాలింపిక్స్ అర్హత టోర్నీలో సత్తా చాటాడు. మిక్స్‌డ్ డబుల్స్ స్కల్స్ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో పారిస్‌లో జరిగే పారాలింపింపిక్స్‌కు ఎంపికైంది. [...]