తొలిసారి ఆసియా కప్ విజేతగా శ్రీలంక
మహిళల ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జయభేరి మోగించింది. మెగా టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించింది. అజేయంగా టైటిల్ పోరుకు వచ్చిన భారత జట్టు(Team India)పై లంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల ఛేదనలో ఓపెనర్ చమరి ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్)లు ఉతికేశారు. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా లంక బ్యాటర్లకు వరమైంది. కవిష దిల్హరి(30 నాటౌట్)తో కలిసి 73 [...]