Search for:

సర్ఫరాజ్‍ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు

దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. దీంతో దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది. కాగా రెండో టెస్టుకు భారత స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఈ క్రమంలో [...]

సోనమ్‌ సిల్వర్‌ షూట్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల హవా సాగుతోంది. సోమవారం జరిగిన పోటీల్లో యువ షూటర్‌ సోనమ్‌ మస్కార్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రజతం సాధించింది…సోనమ్‌ సిల్వర్‌ షూట్‌ కైరో (ఈజిప్టు): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల హవా సాగుతోంది. సోమవారం జరిగిన పోటీల్లో యువ షూటర్‌ సోనమ్‌ మస్కార్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రజతం సాధించింది. తొలిసారి వరల్డ్‌ [...]

ఆంధ్ర ఘన విజయం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర 126 పరుగులతో ఘన విజయం సాధించింది. 320 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 20/0తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్‌ 193 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్‌, నితీశ్‌ చెరో మూడేసి, పృథ్వీరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఏపీకి ఆరు పాయింట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 431, రెండో ఇన్నింగ్స్‌లో 150/2 [...]

హరియాణా గెలుపు

పట్నా: ప్రొ.కబడ్డీ లీగ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 41-36తో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో హరియాణా జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 32-20తో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. [...]

ఐదో స్థానానికి భారత్‌

దుబాయ్‌: తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ ఆరంభంలో పట్టు కనబర్చిన రోహిత్‌ సేన.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్‌ డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌ ప్లేస్‌ చేజిక్కించుకోగా.. తాజా ఫలితంతో బంగ్లాతర్వాతి స్థానానికి చేరింది. [...]

దీప్‌ గ్రేస్‌ రిటైర్మెంట్‌

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ డిఫెండర్‌ దీప్‌ గ్రేస్‌ ఎక్కా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 2016 రియో, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల ఎక్కా పెనాల్టీ కార్నర్‌ స్పెషలి్‌స్టగానూ పేరు తెచ్చుకుంది. 2011లో అరంగేట్రం చేసిన ఎక్కా 268 మ్యాచ్‌ల్లో 24 గోల్స్‌ చేసింది. [...]

లంక క్రికెట్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐసీసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేత..

శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్‌లో శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ)పై విధించిన నిషేధాన్ని తాజాగా ఐసీసీ ఎత్తివేసింది. గత కొంతకాలంగా లంక క్రికెట్‌ బోర్డుపై ఓ కన్నేసి ఉంచిన ఐసీసీ.. బోర్డు తీసుకుంటున్న చర్యలపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్‌ ఫెర్నాండో ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది [...]

ఛత్తీస్‌గఢ్‌తో రంజీ.. పట్టుబిగించిన ఆంధ్ర

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌పై ఆంధ్ర పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 118/3తో మూడో రోజు, ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్‌ 262 పరుగులకు ఆలౌటైంది. అమన్‌దీప్‌ (54), సంజీత్‌ (54) అర్ధశతకాలు సాధించారు. పృథ్వీరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గిరినాథ్‌ రెడ్డి, శశికాంత్‌, అశ్విన్‌ హెబ్బర్‌ తలో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. 169 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆంధ్ర.. రెండో ఇన్నింగ్స్‌లో 150/2 వద్ద డిక్లేర్‌ చేసింది. [...]

తలైవాస్‌ గెలుపు

పట్నా: పీకేఎల్‌లో ఆదివారం తమిళ్‌ తలైవాస్‌ 50-34తో యు ముంబాపై విజయం సాధించింది. తలైవాస్‌ జట్టులో నరేందర్‌ (13), అజింక్య (10) సత్తా చాటారు. యు ముంబా తరఫున గుమన్‌ సింగ్‌ (13) రాణించాడు. జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, బెంగళూరు బుల్స్‌ మధ్య మ్యాచ్‌ 28-28తో టైగా ముగిసింది. [...]

ఖేలో ఇండియాలో తెలంగాణ హవా

హైదరాబాద్‌:ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ప్లేయర్లు మూడు స్వర్ణాలు సాధించారు. తొలుత బాలుర ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు స్వర్ణం సాధించాడు. అనంతరం హైదరాబాద్‌ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో పసిడితో మెరిసింది. ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వాల్టింగ్‌ టేబుల్‌ విభాగంలో నిషిక అగర్వాల్‌ స్వర్ణం కొల్లగొట్టింది. ఓవరాల్‌ ఈ పోటీల్లో [...]