సీఎం రేవంత్‌తో జాతీయ సాకర్ చీఫ్ భేటీ
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా క్వాలిఫయర్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలోని సీఎం కార్యాలయంలో రేవంత్ రెడ్డితో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే బృందం భేటీ అయింది. వచ్చే జూన్ 6వ తేదీన దేశంలో నిర్వహించాల్సిన భారత్, కువైట్ జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ [...]