నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
పంచ్‌కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్‌కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ [...]