అశ్విని–తనీషా సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంక్ ద్వయం అశ్విని–తనీషా 21–19, 13–21, 21–15తో ప్రపంచ 9వ ర్యాంక్ జంట వకాన నాగహార–మాయు మత్సుమోటో (జపాన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో సూపర్–1000 స్థాయి టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. [...]