Search for:

క్వార్టర్స్‌కు చేరిన సాత్విక్‌- చిరాగ్ జోడీ

Paris Olympics-2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి అద‌ర‌గొట్టారు. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్ జంట అడుగుపెట్టింది. త‌ద్వారా ఓ అరుదైన ఘ‌న‌త‌ను ఈ స్టార్ భార‌త జోడీ త‌మ పేరిట లిఖించుకున్నారు. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్ట‌ర్స్‌కు చేరిన తొలి భార‌త జోడీగా వీరిద్ద‌రూ రికార్డు సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన అల్ఫియన్- ఫజార్ చేతిలో 21-13, [...]

పతక వేటలో.. మన మెరుపులు

– పారిస్‌ ఒలింపిక్స్‌ మరో 7రోజుల్లో ప్రపంచ వేదికపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించేందుకు.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకంతో మెరిసేందుకు.. పారిస్‌లో మన సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. పతకాలు గెలిచి.. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తేవడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది మంది మన అథ్లెట్లు పతక వేటకు వెళ్లబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తరపున పీవీ సింధు, సాత్విక్‌ (బ్యాడ్మింటన్‌), జ్యోతి యర్రాజి, దండి [...]

ఓటమి బాటలోనే

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి బాటలోనే సాగుతోంది. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. బుధవారం 29-54 తేడాతో తమిళ్‌ తలైవాస్‌ చేతితో చిత్తయింది. ఎప్పటిలాగే కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ (10) ఒంటరి పోరాటం చేశాడు. అతను కాకుండా అజిత్‌ పవార్‌ (7), హమిద్‌ (6) మాత్రమే ఫర్వాలేదనిపించారు. తలైవాస్‌ జట్టులో అజింక్య (11), సాగర్‌ (8), నరేందర్‌ (9) [...]

భారత అమ్మాయిల శుభారంభం

మస్కట్‌: హాకీ ఫైవ్స్‌ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం పూల్‌-సి తొలి మ్యాచ్‌లో 5-4 గోల్స్‌తో పోలెండ్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా సాగింది. తొలి పది నిమిషాల్లోనే భారత్‌-పోలెండ్‌ ఖాతాలో రెండేసి గోల్స్‌ చేరాయి. భారత్‌ తరఫున ముంతాజ్‌ (4వ), దీపిక (6వ).. పోలెండ్‌ జట్టులో జూలియా (8వ), మార్లీనా (10వ) సఫలమయ్యారు. 23వ నిమిషంలో ముంతాజ్‌, మరియానా గోల్స్‌ సాధించడంతో భారత్‌ [...]

డాకర్‌ ర్యాలీలో హీరో రేసర్‌కు రెండో స్థానం

యాన్బు (సౌదీ అరేబియా): హీరో మోటోస్పోర్ట్స్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక డాకర్‌ ర్యాలీని ఆ జట్టు రేసర్‌ రాస్‌ బ్రాంచ్‌ రెండో స్థానంతో ముగించాడు. డాకర్‌ ర్యాలీలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా హీరో మోటోస్పోర్ట్స్‌ రికార్డు నెలకొల్పింది. మరోవైపు ర్యాలీ 2లో భారత్‌కు చెందిన షెర్కో టీవీఎస్‌ ర్యాలీ ఫ్యాక్టరీకి చెందిన రేసర్‌ హరిత్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ విభాగంలోనూ ఈ [...]

హారిక పరాజయం

విక్‌ ఆన్‌జీ: టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారికకు మరో ఓటమి ఎదురైంది. ఛాలెంజర్స్‌ విభాగం అయిదో రౌండ్లో లియాన్‌ ల్యూక్‌కు హారిక తలొంచింది. ఈ ఓటమితో 1.5 పాయింట్లతో ఈ తెలుగమ్మాయి పన్నెండో స్థానంలో కొనసాగుతోంది. అయిదు రౌండ్లలో మూడు గేమ్‌లను డ్రా చేసుకున్న హారిక.. రెండింట్లో ఓడింది. ఇమాజ్‌ ముస్తఫా చేతిలో ఓడిన దివ్య దేశ్‌ముఖ్‌ (1.5) 13వ స్థానంలో ఉంది. మాస్టర్స్‌ విభాగం అయిదో [...]

ప్రొకబడ్డీలో బాలయ్య సందడి

ప్రొ కబడ్డీ పదో సీజన్‌ భాగ్యనగరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. లీగ్‌ ప్రచారకర్త, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తెలుగు టైటాన్స్‌-బెంగళూరు బుల్స్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య.. తొడ గొట్టి క్రీడాకారులను, అభిమానులను ఉత్తేజపరిచారు. ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌ తరువాత కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందిందన్నారు. తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమన్న బాలయ్య.. తన కారులో [...]

జాతీయ ఆర్చరీ ఉపాధ్యక్షులుగా సత్యం, సంజీవ

జాతీయ ఆర్చరీ సంఘం ఎన్నికల్లో ఇద్దరు తెలుగు వ్యక్తులకు చోటు లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి ఉపాధ్యక్షులుగా గెలిచారు. ఇక, జాతీయ సంఘం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ప్రధాన కార్యదర్శిగా వీరేంద్ర సచ్‌దేవ్‌ ఎన్నికయ్యారు. [...]

తొలి టి20లో భారత్‌ విజయం

6 వికెట్లతో ఓడిన అఫ్గానిస్తాన్‌ శివమ్‌ దూబే అజేయ అర్ధ సెంచరీ ఆదివారం ఇండోర్‌లో రెండో మ్యాచ్‌ విరాట్‌ కోహ్లి ఆడలేదు… రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు… అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్‌ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా… చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో శివమ్‌ దూబే మెరుపులు జట్టును సిరీస్‌లో ఆధిక్యంలో నిలిపాయి. [...]

ఒలింపిక్‌ బెర్త్‌ నంబర్‌ 16

జకార్తా: ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో ఈసారి భారత్‌ నుంచి షూటింగ్‌ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడనున్నారు. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు అర్హత పొందగా… ఈసారి ఆ సంఖ్య 16కు చేరుకుంది. ఇంకా షూటింగ్‌లో మరో మూడు క్వాలిఫయింగ్‌ టోర్నీలు మిగిలి ఉండటం, మరో ఎనిమిది బెర్త్‌లు ఖాళీగా ఉండటంతో భారత్‌ నుంచి [...]